వివేకానంద స్వామి సూక్తులు

* అజ్ఞానులకు వెలుగుచూపండి. విద్యావంతులకు మరింత వెలుగుచూపండి.
ఆధునిక విద్య పెంచే అహంకారానికి అంతులేకుండా పోతూంది.

* మీరు పవిత్రులు కండి. అప్పుడు ప్రపంచమంతా పవిత్రంగా
కనబడి తీరుతుంది

* వేదాంత దృక్పధంలో పాపమనేదే లేదు. పొరపాట్లు మాత్రమే ఉన్నాయి.
మీరు పాపాత్ములనీ, ఎందుకూ పనికిరానివారనీ అనడమే వేదాంతం
దృష్టిలో పెద్ద పొరపాటు.

*విగ్రహాన్ని దేవుడని అనవచ్చు. కానీ దైవం విగ్రహమే అని ఆలోచిస్తే,
అది పొరపాటు

*మతం సిద్ధాంతాలలో,రాద్ధాంతాలలో లేదు. దాని రహస్యమంతా ఆచరణ్లోనే
వుంది. పవిత్రంగా ఉండటం, పరులకు మేలు చేయడం- మతమంటే ఇదే.

*సజీవ దైవాలను సేవించండి. అంధుడు,పేదవాడు, వికలాంగుడు,దుర్బలుడు,
కౄరుడు, ఇలా వివిధ రూపాల్లో భగవంతుడు మీ వద్దకు వస్తాడు.

* ఆదరించబడుతూ, ఆనందంగా ఉన్న కుటుంబాలపై పరమేశ్వరుని
కృప ప్రసరిస్తుంది
*ముగ్గురు వ్యక్తులు కలిసికట్టుగా ఐదు నిమిషాలైనా పని
చేయలేరు. ప్రతి ఒక్కరూ అధికారం కోసమే అర్రులు చాస్తారు. చివరికి
మొత్తం వ్యవస్త కుప్పకూలుతుంది

*" నువ్వు దుష్టుడివి " అనవద్దు. " నువ్వు మంచివాడివి ", కానీ
"మరింత మెరుగవ్వాలి" అని మాత్రం అనండి.
*హనుమంతుణ్ణి, జగజ్జననినీ స్మరించండి.మరుక్షణం మీలోని దౌర్బల్యం
పిరికితనాలు మటుమాయమవుతాయి.

     *పురాణాలు వర్ణించిన ముప్ఫై మూడు కోట్ల దేవతల్లో విశ్వాసం ఉండీ,
     మీపై మీకు విశ్వాసం లేకపొతే విముక్తి లేదు.

  • ఎవరినీ తప్పు పట్టవద్దు , నిందించవద్దు
  • సహాయపడగలిగితే సాయంచేయ్యి లేకపోతె ఆశీర్వధించి పంపివేయు
  • మనలను మన ఆలోచనలే తీర్చు దిద్దుతాయి
  • మాటలదేముంది ఆలోచనలే కలకాలం ఉంటాయి .సుదూరము ప్రయాణము చేస్తాయి .
  • దేవుడు ఎక్కడో లేదు . నీలోనే ఉన్నాడు.ప్రతీ జీవిలోను ఉన్నాడు.ఇతరులకి మనము ఎంత మేలుచేస్తే మన హృదయాలు అంత పవిత్రమవుతాయి.అందులోనే దేవుడున్నాడు.
  • ప్రేమ... డబ్బు... ఙ్ఞానం.. చదువు... దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది.         అందుకోసం మనం కనబరచల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్తుదల, సంకల్పబలం, శ్రమించే తత్వం

  •  గొప్ప అవకాసాలే వస్తే ఏమి చేతకాని వారు కూడా ఏదో గోప్ప సాదించ వచ్చు. ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా ఏదైనా సాదించినవాడే గొప్పవాడు

  • ఆత్మవిస్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాదించిన గొప్ప వ్యక్తుల జీవతాలన నిసితంగా పరిశీలించండి వారిని నడిపించింది ఆత్మవిశ్వసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడు అనేది ఒకప్పటి మాట. ఆత్మవిస్వాసం లేనివాడు నాస్తికుడు అనేది నేటి మాట.

  • ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. భాధ్యత తీసికో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది పనికీ విశ్రాంతికీ మధ్య సరైన సమతౌల్యం ఉండాలి

  •  పిరికితనానికి మించిన మహపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టలి అప్పుడే మనిషినని అనిపించుకొంటవు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కాని పోరాటం అవసరం.

  •  అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం ఇదే మనకు కావలి. వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలం. వెనక్కి చూడకండి ముందడుగే వేయండి.

  •  మనలొ ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదు నిమిషాలు పని చేయలేం. ప్రతి వ్యక్తి పెత్తనం కోసం పాకులాడు తుంటాడు అందువల్లే మోత్తం పని, వ్యవస్ధ చెడిపోతుంది

 

This free website was made using Yola.

No HTML skills required. Build your website in minutes.

Go to www.yola.com and sign up today!

Make a free website with Yola